9 నిమ్మకాయలకు రెండున్నర లక్షలు.. ఎందుకో తెలుసా?

1037చూసినవారు
9 నిమ్మకాయలకు రెండున్నర లక్షలు.. ఎందుకో తెలుసా?
తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలోని సుబ్రమణ్య స్వామి ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఏడాది స్వామివారికి 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో స్వామివారి శూలానికి రోజుకో నిమ్మకాయ గుచ్చుతారు. 9 రోజుల తర్వాత వాటిని వేలం వేస్తారు. దాంతో ఈ ఏడాది జరిగిన వేలంలో 9 నిమ్మకాయలు రూ.2.50 లక్షలకు పైగా ధర పలికాయి. ఇక మొదటి రోజు నిమ్మకాయకు ఏకంగా రూ.50,500 ధర పలకడం గమనార్హం. ఈ నిమ్మకాయల వల్ల సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకం.

ట్యాగ్స్ :