అండర్ 19 అసియా కప్: నవంబర్ 30న పాక్‌తో తలపడనున్న భారత్

79చూసినవారు
అండర్ 19 అసియా కప్: నవంబర్ 30న పాక్‌తో తలపడనున్న భారత్
అండర్-19 ఆసియా కప్.. క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్ నవంబర్ 30న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు దుబాయ్, షార్జాలో జరగనున్న ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. గ్రూప్-ఎ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ డిసెంబర్ 2, 4 తేదీల్లో షార్జాలో జపాన్, యూఏఈతో తలపడనుంది. భారత్ చివరిగా 2021లో అండర్-19 ఆసియా కప్ గెలుచుకుంది.