కేరళలో వాయనాడ్‌లోని కట్టికుళం సమీపంలో శుక్రవారం ఒక ఏనుగు పిల్ల రోడ్డుపై ఒంటరిగా సంచరిస్తూ ప్రయాణికులకు కనిపించింది. ఎటు వెళ్లాలో తెలీని పరిస్థితిలో రోడ్డుపై అటూ ఇటూ సంచరించింది. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. పిల్ల ఏనుగు తన తల్లి నుంచి విడిపోయి రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు.