

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా (వీడియో)
భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 90.23 మీటర్లు విసిరాడు. నీరజ్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటివరకు భారత్ తరఫున రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన నీరజ్ తన కెరీర్లో ఇంతకుముందు బల్లెంను 90 మీటర్లు విసరలేదు. అంతకుముందు 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరం విసిరాడు.