బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాచలం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇంకా ఈ నెల 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.