ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చవితిగా జరుపుకుంటారు. అయితే వినాయక చవితి నాడు కొ
న్ని పనులు చేయొద్దని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పొరపాటున కూడా విరిగిన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు. గణపతి పూజలో తులసి దళాన్ని , మొగలి పువ్వులను ఉపయోగించకూడదు. గణేష్ చతుర్థి రోజున ఉపవాసం, పూజలు చేసే వ్యక్తి శరీరం, మనస్సులో స్వచ్ఛంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలని పండితులు సూచిస్తున్నారు.