ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో అంతుపట్టని కుంటి జ్వరం
బీహార్లో 'లేమ్ ఫీవర్ వ్యాప్తి' చెందుతోంది. ఇదొక అంతుపట్టని జ్వరంగా మారింది. ఎక్కువగా దోమల ద్వారా వ్యాపించే ఈ జ్వరం ఇటీవల ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో కనిపిస్తోంది. ఈ జ్వరంతో బాధపడుతున్న రోగి నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. అందుకే దీన్ని కుంటి జ్వరం అని అంటున్నారు. ఈ జ్వరం ఎక్కువగా మోకాళ్లు, నడుముపై ప్రభావం చూపుతుంది. రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు.