సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన హరీష్ రావు (వీడియో)

71చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'శనివారం ఉదయం 9 గంటలకు చర్చకు సిద్ధం.. నేనే డ్రైవింగ్ చేస్తాను, పక్కన కూర్చోండి. ముందు మూసీకి వెళ్లాం, ముందు మూసీకి వెళ్లి అక్కడ బాధితులతో మాట్లాడుదాం. ఆ తర్వాత R&R కాలని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ దగ్గరకి వెళ్లి మాట్లాడుదాము.' అని బహిరంగ సవాల్ విసిరారు.