తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ..?

20629చూసినవారు
తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ..?
తెలంగాణలో త్వరలో వాలంటీర్ వ్యవస్థను తెస్తామ‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా అమల్లో ఉందని ఆయ‌న అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుందని తెలిపారు. దీంతో త్వ‌ర‌లోనే ఏపీ మాదిరిగానే తెలంగాణ‌లో కూడా వాలంటీర్ వ్య‌వ‌స్థ రానున్న‌ట్లు తెలుస్తోంది.