ఓటేసిన సినీ నటుడు కోట శ్రీనివాసరావు

84చూసినవారు
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలోనూ ఓటేసేందుకు జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆదర్శంగా నిలిచారు. ఓటేసేందుకు యువకులు ముందుకు రాని వేళ వృద్ధులు విధిగా కేంద్రానికి రావడం ఆలోచింపజేస్తోంది. యువత వీరిని చూసి తమ ఆలోచనలు మార్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.