ప్రస్తుత రోజుల్లో అందరూ చెప్పులు లేకుండా నడవడం లేదు. అయితే పచ్చిక ఉన్న ప్రాంతాల్లో, ఇసుకలో చెప్పులు లేకుండా నడిస్తే బీపీ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాలి చర్మం నేరుగా నేలతో సంబంధం ఉంటే శరీరంలోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అరికాళ్లలో రక్తనాళాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ పెరిగి, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా దూరం అవుతాయి. శరీరంలో వాపు సైతం తగ్గుతుంది.