సాగుకు ఉపాధి హామీ అనుసంధానం: పవన్
AP: సాగుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలనేది ఎన్డీయే ప్రభుత్వ ఉద్దేశమని, దీన్ని త్వరలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాలువలు, కుంటలు, చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులను కూడా ఈ పథకం కింద చేపడతామన్నారు. స్మశాన వాటికల అభివృద్ధికి కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. డిమాండ్‌ను బట్టి గ్రావెల్ రహదారులు వేస్తామన్నారు.