బొగత జలపాతం సందర్శనకు అనుమతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం వాజేడు బొగత జలపాతం సందర్శనకు శనివారం నుండి అటవీశాఖ అధికారులు అనుమతిస్తున్నారు. పర్యటకులకు జలపాతం నీళ్లలో దిగటం, ఈతలు కొట్టటానికి అనుమతి నిరాకరించారు. జలపాత పరిసర ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పర్యాటకులు సహకరించాలని అటవీ శాఖ అధికారులు కోరారు.