ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ 241 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన భారత్ 244/4 స్కోరు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రెండో విజయం సాధించగా.. ఆతిథ్య దేశం పాక్ అవుట్ అయింది. వరుస ఓటములతో పాక్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. పాక్‌పై విజయంతో భారత్ సెమిస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.