పాడుతా తీయగా కార్యక్రమానికి ఎంపికైన జనగామ కుర్రాడు
జనగామ గుండ్లగడ్డకు చెందిన బాలు అనే యువకుడు ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమానికి ఎంపిక అయ్యాడు. గాన గంధర్వుడు ప్రముఖ సినీ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం చేత ప్రశంసలు అందుకున్న బాలు పాడిన ప్రోగ్రాం ఆదివారం ప్రసారం కానుంది. స్థానిక సాయిబాబా గుడిలో, నగరంలో , చుట్టుపక్కల ప్రాంతాలలో అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమాలలో భక్తి పాటలు పాడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ,నేడు ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో ఎంపిక కావడంతో మన జనగామకే గర్వకారణమని పలు స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక సంస్థలు అభినందిస్తూ ఆదివారం ప్రసారమయ్యే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చూసి బాలును ఆశీర్వదించాలని కోరారు.