వాట్సాప్‌లో కొత్త అప్డేట్.. ఇక నుంచి స్టేటస్‌ను లైక్ చేయొచ్చు
వాట్సాప్‌కు పెరుగుతున్న వినియోగదారుల దృష్ట్యా, కంపెనీ ప్రతిరోజూ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో స్టేటస్‌లను చూసి, రిప్లై ఇచ్చే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు కంపెనీ దీనికి కొత్త ఫీచర్‌ను జోడించింది. ఇప్పటి నుంచి మనం చూసే వాట్సాప్ స్టేటస్‌లకు లైక్ కూడా చేయవచ్చు. వాట్సాప్ స్టేటస్ కింద రిప్లై ఆప్షన్ పక్కన హార్ట్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ స్టేటస్‌ను లైక్ చేయవచ్చు.