18 ఏళ్ల క్రీడాకారిణిపై 5 ఏళ్ల పాటు అత్యాచారం.. 44 మంది అరెస్టు
18 ఏళ్ల అథ్లెట్ పై ఐదేళ్ల పాటు అత్యాచారం చేసిన 44 మంది నిందితులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 62 మంది తనను లైంగికంగా వేధించారని సదరు బాలిక ఆ నేరాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వివరించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కారులో, ఆసుపత్రి వద్ద, కొండ ప్రాంతాల్లో సహా ఆమె కనీసం ఐదు సార్లు సామూహిక అత్యాచారానికి గురైనట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది.