తిరుపతి ఎస్పీకి మంచు మనోజ్ ఫోన్ చేశారు. మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద జరుగుతున్న పరిస్థితిని ఎస్పీకి వివరించారు. గొడవలు పెట్టుకోవడానికి ఎంబీ యూనివర్సిటీకి రాలేదని, తన తాత నానమ్మలకు నివాళులర్పించడానికే వచ్చానని మనోజ్ వెల్లడించారు. అవసరమైతే తనను అరెస్ట్ చేసినా పర్వాలేదని వ్యాఖ్యానించారు. తాతా నానమ్మల కోసం దెబ్బలు తినడానికైనా రెడీగా ఉన్నానని చెప్పారు.