నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
AP: శ్రీశైలంలో శనివారం నుంచి ఈ నెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉ.8.45 గంటలకు స్వామి వారి యాగశాల ప్రవేశంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆదివారం నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించనున్నారు. అయితే నేటి నుంచి ఉత్సవాలు ముగిసే వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు నిలిపివేశారు.