విరాళాల సేకరణలో టాప్‌లో తెలుగు ప్రాంతీయ పార్టీలు!

85చూసినవారు
విరాళాల సేకరణలో టాప్‌లో తెలుగు ప్రాంతీయ పార్టీలు!
విరాళాల సేకరణలో తెలుగు ప్రాంతీయ పార్టీలు టాప్‌లో నిలిచాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటికి రూ.200 కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా BRSకు రూ.154.03 కోట్లు, YCPకి రూ.16 కోట్లు, TDPకి రూ.11.92 కోట్ల విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. ఈ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా 78 శాతంకార్పొరేట్, వ్యాపార సంస్థల నుంచి, వ్యక్తిగత దాతల నుంచి 22 శాతం విరాళాలు వచ్చాయని తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్