ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు
AP: సీఎం చంద్రబాబు సమక్షంలో వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని, టీడీపీని అణగదొక్కేందుకు ఆళ్ల నాని చేయని ప్రయత్నం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలోకి దేనికి వస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీలో చేరాలనుకుంటే నేతలు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.