బీచ్‌లో యోగా చేస్తుండగా.. భారీ కెరటానికి కొట్టుకుపోయిన హీరోయిన్ (వీడియో)

72చూసినవారు
ప్రశాంతంగా యోగా చేసేందుకు సముద్రం ఒడ్డుకు వెళ్లిన ఓ యంగ్ హీరోయిన్‌ని ఓ రాకాసి అల లాక్కెళ్లి ప్రాణాలు తీసింది. రష్యాకు చెందిన 24 ఏళ్ల నటి కెమిల్లా బెల్యాట్స్కాయా ఇటీవల థాయిలాండ్ పర్యటనకు వెళ్లింది. థాయిలాండ్ లోని ఓ ద్వీపంలో నీటి ఒడ్డున రాళ్లపై కూర్చుని ధ్యానం చేస్తుండగా ఒక్కసారిగా భారీ కెరటం దూసుకొచ్చి ఆమెను లాక్కుపోయింది. బీచ్‌లో అందరూ చూస్తుండగానే.. కొద్దిసేపటికి ఆమె శవం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

సంబంధిత పోస్ట్