AP: ఫెంగల్ తుఫాను ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షం కారణంగా ఇవాళ గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే నేడు స్కూళ్లకు సెలవుపై కలెక్టర్లు, డీఈవోలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, సోమవారం అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.