AP: జూ.ఎన్టీఆర్ అభిమానులు మరోసారి వార్తల్లో నిలిచారు. ‘ఎన్టీఆర్ మీల్స్’ పేరుతో పేదవారి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ సేవలను ప్రారంభించారు. చిన్న చినుకుతో మొదలయ్యే సేవ తప్పకుండా మహాసముద్రంగా మారుతుందంటూ ఎన్టీఆర్ అభిమానులు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.