గర్భిణీ మృతి.. వైద్యులు లేకపోవడమే కారణం!
AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం రామన్నవలసకు చెందిన లక్ష్మి అనే గర్భిణీ మృతి చెందారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం రాత్రి 12 గంటలకు ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరు. అయితే పురిటినొప్పులతో బాధపడుతూ లక్ష్మి ప్రాణాలు విడిచారు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే లక్ష్మి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.