AP: కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తోంది. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. అయితే జన్మభూమి సభలకు వచ్చే విజ్ఞప్తుల పరిష్కారానికి నిధుల కొరత ఉన్నందున ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి నిరాశే మిగిలినట్లయింది.