దర్తీ ఆభగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గిరిజన గౌరవ దినోత్సవ సమారోహము కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గోన్నారు. బిర్సా ముండా తన జాతి ప్రజలకోసం బ్రిటిష్ పాలకుల ను ఎదిరించిన దీశాలి అని అన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.