నల్లబెల్లి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసుల ఆంక్షలు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 7 గంటల నుండి 01 జనవరి 2025 బుధవారం ఉదయం ఐదు గంటల వరకు నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ తెలిపారు. యువత శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలి, మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.