నర్సంపేట: కొత్తగూడ పాకాల ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం

82చూసినవారు
నర్సంపేట: కొత్తగూడ పాకాల ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం
వరంగల్ జిల్లా నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై పాకాల సమీపాన భారీ వృక్షం శనివారం రాత్రి నేలకొరిగింది. దీంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకొన్న ఖానాపురం ఎస్సై సిహెచ్ రఘుపతి తన సిబ్బందితో కలిసి వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాడు. సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సహాయంతో వృక్షాన్ని పక్కకు తొలగించారు.

సంబంధిత పోస్ట్