సంధ్య థియేటన్ ఘటన అత్యంత దురదృష్టకరమని హీరో అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. ‘ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే. ఇది ఎవరివల్లా జరిగిన తప్పు కాదు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. బాధితుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పడికప్పుడు తెలుసుకుంటున్నా. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 15 రోజులుగా ఇంట్లోనే ఉండి బాధపడ్డా’ అని పేర్కొన్నారు.