గల్లంతైన వ్యక్తి శవం గా తేలాడు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో గల వట్టెవాగులో పడి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గల్లంతైన వ్యక్తి బుధవారం మధ్యాహ్నం శవమై తేలాడు. మృతుడు షేక్ అజ్మత్ గా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.