వెంకటాపురం చెరువు అలుగులో చిక్కుకున్న బస్

576చూసినవారు
భారీ వర్షాలకు నెక్కొండ మండలంలోని వెంకటాపురం చెరువులోకి వరద భారీగా చేరి అలుగు పోస్తోంది. ఈ అలుగులో ఆర్టీసి బస్సు చిక్కుకుంది. రాత్రి 9: 30 నుంచి నీరు ఆహారం లేక 45 మంది ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. వేములవాడ నుంచి భద్రాచలం వెళుతున్న బస్సు వరదలో చిక్కుకొని పది గంటలవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి సహాయక సహాయం అందక ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రయాణికులు తమకు వెంటనే సహాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్