నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం సముద్రంలో అలజడి ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.