
వరంగల్ ఎంజీఎంలో ఓపీ లైన్ లో మరణించిన వ్యక్తి
ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లి అక్కడే కుప్పకూలిన ఘటన మంగళవారం వరంగల్ ఎంజీఎంలో జరిగింది. శాయంపేటకు చెందిన పిక్కల శ్రీనివాస్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓపీ తీసుకున్నారు. ఆ తర్వాత లైన్ లో నించుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ సిబ్బంది వైద్యులను సంప్రదించగా వారు పరీక్షించి మరణించాడని ధ్రువీకరించారు.