Sep 15, 2024, 04:09 IST/
UPలో బిల్డింగ్ కుప్పకూలి 10 మంది మృతి (వీడియో)
Sep 15, 2024, 04:09 IST
భారీ వర్షాలకు యూపీలోని మీరట్లో మూడంతస్తుల భవనం శనివారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుల్లో ఏడాది వయసున్న బాలికతో సహా నలుగురు చిన్నారులు ఉన్నారు. శిథిలాల నుంచి మొత్తం ఐదుగురిని అధికారులు రక్షించారు. వర్షం కురుస్తున్నప్పటికీ NDRF, SDRF బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. సుమారు 35 ఏళ్ల క్రితం నాటి భవనం అకస్మాత్తుగా కూలిపోయింది.