బల్దియా ముందు గుడిసేవాసుల ఆందోళన

68చూసినవారు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు సోమవారం సిపిఎం పార్టీ నాయకులు, గుడిసె వాసులు ఆందోళన చేపట్టారు. హనుమకొండ 2వ డివిజన్లోని భగత్ సింగ్ నగర్ కాలనీలో 500 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. కానీ కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్