ఆటో కార్మికులతో 30 ఏండ్ల అనుబంధం: మాజీ చీఫ్ విప్
హనుమకొండలోని బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం త్రిచక్ర పొదుపు, పరస్పర సహాయ సహకార సంఘం 4వ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ. కరోనా కష్టకాలంలో ఆటో కార్మికులకు అండగా నిలిచామని అన్నారు. వీరితో 30 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. ఆటో కార్మికుల జీవితాలు మార్చేందుకే సొసైటీని బలోపేతం చేశానని అన్నారు.