విజయాలను చేకూర్చే విజయదశమి విశిష్టత
దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. అధర్మంపై, చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 12, 2024న శనివారం రోజు వచ్చింది. దసరానే విజయదశమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం దశమి రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించారు. తద్వారా అధర్మంపై ధర్మం విజయం సాధించిందని ప్రజల నమ్మకం. మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి విజయానికి గుర్తుగా ఈ రోజు దసరా పండుగ జరుపుకుంటారు.