వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని చౌటపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ, పరిశీలన చేయడానికి గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు హాజరు కానునున్నారు.