
నేడు హోలీ.. రంగుల రంగేళి
వసంత రుతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హెూలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం.. పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను హెలీ పూర్ణిమ అని కూడా అంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగ హోలీ. 'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుంచే వాడుకలో ఉంది.