హోలీ వేడుకల్లో దారుణం జరిగింది. రంగు పూసుకునేందుకు నిరాకరించడంతో ఓ వ్యక్తిని గొంతు నొక్కి చంపేశారు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాల్వాస్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక లైబ్రరీకి వెళ్లారు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 25 ఏళ్ల హన్స్‌రాజ్‌పై రంగులు పూసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోవడంతో ఆ ముగ్గురూ బెల్టులతో అతడ్ని కొట్టారు. ఒక వ్యక్తి గొంతు నొక్కడంతో అతడు మరణించాడు.