విజయవాడ ఇంద్రకీలాద్రిపై అద్భుత దృశ్యం (వీడియో)
విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారీ వర్షానికి ఓ జలపాతం ఏర్పడింది. కొండపై నుంచి నీరు కిందకు జాలువారుతూ దుర్గమ్మ గుడికి కొత్త శోభ తీసుకొచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. ఇందకీలాద్రిపై వరద నీరు ఇలా జలపాతంలా రావడం తొలిసారిగా చూస్తున్నామని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.