విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా వినూత్న ప్రచార కార్యక్రమాలతో మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. తాజాగా యాంకర్ సుమ ఇంటికి వెళ్లి అక్కడ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆద్యంత నవ్వులు పంచేలా సాగిన ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆదివారం రానుంది.