భూమి చేసే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి 2 గంటలకు లగ్నం మారుతూ ఉంటుంది. 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభమవుతుంది. ఒక రోజుకు 4 నిమిషాల కాలం ముందుకు జరుగుతూ ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ ఉంటుంది. వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభమవుతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు.