‘డైరెక్టర్ సుకుమార్ లేకపోతే నేను లేను’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆదివారం ‘కిస్సిక్’ పాటు విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డైరెక్టర్ రాఘవేంద్రరావు నాకు తొలి సినిమాను హిట్ మూవీగా ఇచ్చారు . ఆ సినిమా తర్వాత నేను ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. నాతో సినిమా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సుకుమార్ వచ్చి ఆర్య చేశారు. ఆయన వల్లే నా లైఫ్ మారింది’ అని అల్లు అర్జున్ అన్నారు.