స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా SHG సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. SHGలకు ఫెడరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి చర్యలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.