వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: రోజా (Video)
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారన్నారు. ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆమె ఆరోపించారు. కనీసం భోజనం అందించడంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ఇప్పటికైనా ప్రలజను కాపాడండి అని ఆమె కోరారు.