ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ ‘‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్’’ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణను దేవాన్ష్ అందుకున్నాడు. దేవాన్ష్ సాధించిన ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.