అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. ఆరుగురు అరెస్టు

78చూసినవారు
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. ఆరుగురు అరెస్టు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. దాడి సమయంలో బన్నీ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. బన్నీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత పోస్ట్