రోహిత్ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అటు కెప్టెన్సీలోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్న రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉండడం అవసరమా... అతడు లేకపోతేనే టీమిండియా తుది జట్టుకు కచ్చితమైన రూపు వస్తుంది అని స్పష్టం చేశాడు. కెప్టెన్ కాకపోయుంటే అతడిని తుది జట్టుకు ఎంపిక చేస్తారునుకోవడం లేదు అంటూ ఇర్ఫాన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.